కరోనా మహమ్మారి బారిన పడి మరణించిన వారిలో వృద్ధులదే అధిక వాటా. అరవై ఏళ్లకు పైబడిన వారే ఎక్కువగా మరణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే.. కర్ణాటకలోని ఓ వృద్ధురాలు కరోనాను విజయవంతంగా ఓడించింది. ఈ బామ్మ వయసు ఎంతో తెలుసా? ఏకంగా 110 ఏళ్లు.
రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లాకు చెందిన సిద్దమ్మ (110)కి జులై 27న కరోనా పాజిటివ్‌గా తేలింది. జిల్లా ఆస్పత్రిలో చేరిన ఆ వృద్ధురాలు వారం రోజుల్లోనే వైరస్ నుంచి కోలుకుంది. వైరస్ పరీక్షలో నెగిటివ్ వచ్చిన క్రమంలో ఆస్పత్రి నుంచి శనివారం డిశ్చార్జి చేసినట్లు జిల్లా వైద్యాధికారి బసవరాజ్ తెలిపారు.
ఇదీ చూడండి: విలయంలో ఉపశమనం- తగ్గుతున్న మరణాల రేటు