సాధారణంగా అవిభక్త కవలల గురించి వింటూ ఉంటాం. ఆ తర్వాత.. వారిని శస్త్రచికిత్స ద్వారా వైద్యులు వేరు చేస్తారు. అచ్చం అలాంటి ఘటనే కర్ణాటకలో జరిగింది. కానీ ఈసారి అది పిల్లుల వంతు అయ్యింది.
కళ్లడ్కకు చెందిన ఓ వ్యక్తి పర్షియా జాతికి చెందిన సియామీస్ పిల్లిని పెంచుకుంటున్నాడు. కొద్దిరోజుల క్రితం ఐదు పిల్లులకు జన్మనిచ్చింది. అందులో నాలుగు పిల్లులు అతుక్కుని పుట్టాయి.

అయితే వాటిని వేరు చేయవలసిందిగా అనేక వెటర్నరీ ఆసుపత్రుల చుట్టూ తిరిగాడు ఆ వ్యక్తి. శస్త్రచికిత్స చేసి వాటిని వేరు చేస్తే అవి చనిపోతాయని వైద్యులు అతనికి తెలిపారు.


చివరికి.. మంగుళూరులోని అడయర్కు చెందిన కే ప్రమోద్ అనే వైద్యున్ని సంప్రదించాడు. విజయవంతంగా మంగళవారం శస్త్రచికిత్స చేసి సియామిస్ పిల్లుల్ని .. వైద్యుడు వేరు చేశారు.
ఇదీ చూడండి: అత్త కోసం గుడి కట్టిన 11 మంది కోడళ్లు