మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై దిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తాజా బులెటిన్ విడుదల చేశారు. ఆయన కోమాలోనే ఉన్నారని.. వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్, మూత్రపిండాల అసమానతలకు సంబంధించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు వైద్యులు.
మెదడుకు సంబంధించి శస్త్రచికిత్స కోసం ఆర్మీ ఆసుపత్రిలో చేరారు ప్రణబ్. అప్పటికే ఆయనకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈనెల 10న ఆపరేషన్ చేశారు.
ఇదీ చదవండి: కాంగ్రెస్-తృణమూల్ స్నేహ గీతం!