శ్రావణ మాసం తొలి సోమవారం వేళ దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. దిల్లీ చాందినీ చౌక్‌లోని గౌరీశంకర్, బంఖండి మహాదేవ్ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కరోనా నియంత్రణకు జాగ్రత్తలు పాటిస్తూ తమ ఇష్టదైవాన్ని ఆరాధించుకున్నారు భక్తులు.
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పుర్‌లోని మానససరోవర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
వారణాసి కాశీ విశ్వనాథుని ఆలయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది.
మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇదీ చూడండి: 'మరోసారి మిడతల దండయాత్ర.. జర జాగ్రత్త'