బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారత షూటర్, కేంద్ర మాజీ మంత్రి, దివంగత దిగ్విజయ్ సింగ్ కుమార్తె శ్రేయసి సింగ్ భాజపాలో చేరింది. బిహార్ భాజపా అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్, పార్టీ సీనియర్ నేత భూపేంద్ర యాదవ్ సమక్షంలో భాజపాలోకి చేరికైంది. అనంతరం.. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసింది.
![Shooter Shreyasi Singh, daughter of ex-union minister, joins BJP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9048617_bjp1.jpg)
![Shooter Shreyasi Singh, daughter of ex-union minister, joins BJP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9048617_1.jpg)
"నా తండ్రి, సోదరి ఆశీస్సులతో భాజపాలో చేరాను. మా నాన్న కలలను నేరవేర్చాలనే ప్రధాన ఉద్దేశంతో పార్టీలో చేరాను. ప్రధానితో పాటు ఆత్మనిర్భర్ భారత్ ప్రచారం చేస్తున్నాను. పూర్తి సామర్థ్యంతో పని చేస్తాను. బిహార్ అభివృద్ధి కోసం పాటు పడతాను."
- శ్రేయసి సింగ్
అమర్పుర్ లేదా జముయి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శ్రేయసి పోటీ చేయనున్నట్లు సమాచారం.
శ్రేయసి తల్లి పుతుల్ కుమారి... 2014 సాధారణ ఎన్నికల్లో బంకా పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
అర్జున అవార్డు గ్రహీత అయిన శ్రేయసి సింగ్.. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి, 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం సాధించింది.
ఇదీ చూడండి: భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ-మోదీ హాజరు