ETV Bharat / bharat

హాథ్రస్‌ ఘటనలో షాకింగ్‌ మలుపు!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్​ హత్యాచార ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుల్లో ఒకరితో బాధితురాలి కుటుంబ సభ్యులు 6 నెలల్లో 104 సార్లు ఫోన్​లో మాట్లాడినట్లు ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు వెల్లడించారు.

Shocking turn in the Hathras event!
హాథ్రస్‌ ఘటనలో షాకింగ్‌ మలుపు!
author img

By

Published : Oct 8, 2020, 8:23 AM IST

Updated : Oct 8, 2020, 8:35 AM IST

హాథ్రస్‌ కేసులో కీలక మలుపు. బాధితురాలి కుటుంబ సభ్యులు నిందితుల్లో ఒకరితో అనేక సార్లు ఫోన్‌లో మాట్లాడినట్టు ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు వెల్లడించారు. తమ వద్దనున్న కాల్‌ రికార్డుల ప్రకారం మృతురాలి సోదరుడు, నిందితుల్లో ఒకరైన సందీప్‌ ఠాకూర్‌ అనే వ్యక్తితో గతేడాది అక్టోబర్‌ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో సుమారు 104 సార్లు ఫోన్‌లో సంభాషించినట్టు వారు వెల్లడించారు. ఈ వివరాల ఆధారంగా బాధితురాలి సోదరుడిని ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులు ప్రశ్నించారు. అయితే ఈ ఫోన్‌ సంభాషణల గురించి తనకేమీ తెలీదని.. తాను గానీ, తన కుటుంబంలో ఇంకెవరూ గానీ ఎవరితోనూ మాట్లాడలేదని చెప్పారు.

ఇదీ చూడండి: 'హాథ్రస్​' ఘర్షణల కోసం విదేశాల నుంచి రూ.100 కోట్లు!

సెప్టెంబర్‌ 14న యూపీలోని హాథ్రస్‌ గ్రామంలో ఓ దళిత యువతిపై దాడి జరగ్గా.. తీవ్ర గాయాల పాలైన బాధితురాలు అదే నెల 29న మృతిచెందింది. ఈ ఘటనలో సామూహిక అత్యాచారం జరిగిందని బాధితురాలు సహా పలువురు ఆరోపించారు. అయితే అటువంటిదేమీ జరగలేదని, మెడకు తగిలిన గాయం వల్లే ఆమె మరణించిందని పోలీసులు వాదిస్తున్నారు. ఈ ఘటనలో పోలీసులు మృతదేహాన్ని హడావుడిగా దహనం చేయడం విమర్శలకు తావిచ్చింది. అల్లర్లు చెలరేగవచ్చనే నిఘా వర్గాల సమాచారం మేరకే తాము ఈ చర్యకు పాల్పడ్డామని యూపీ పోలీసులు సుప్రీం కోర్టుకు వెల్లడించారు.

ఇవీ చూడండి:

హాథ్రస్ ఘటనపై 'సిట్'‌ నివేదిక ఆలస్యం

'హాథ్రస్​'పై పోలీసులకు షాక్​​​.. అత్యాచారం జరిగినట్లు రిపోర్ట్​!​

Last Updated : Oct 8, 2020, 8:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.