ETV Bharat / bharat

ఎన్నికల ఫలితాలతో అన్నం ముట్టని లాలూ!

సార్వత్రిక ఎన్నికల్లో బిహార్​, ఝార్ఖండ్​ రాష్ట్రాల్లో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్​జేడీ) ఘోర ఓటమితో ఆ పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్​ యాదవ్ రెండురోజుల పాటు భోజనం ముట్టలేదు. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువెడిన తర్వాత లాలూ ఆహారం నిరాకరించారట. చివరకు ఆరోగ్యం దెబ్బతింటుందని తాము వారిస్తే 26న భోజనం చేసినట్లు వైద్యులు తెలిపారు.

author img

By

Published : May 27, 2019, 4:12 PM IST

Updated : May 27, 2019, 5:32 PM IST

ఎన్నికల ఫలితాలతో అన్నం ముట్టని లాలూ..!
ఎన్నికల ఫలితాలతో అన్నం ముట్టని లాలూ!

ఎన్డీఏ ప్రభంజనంతో బిహార్​, ఝార్ఖండ్​ రాష్ట్రాల్లో రాష్ట్రీయ జనతా దళ్​(ఆర్​జేడీ) నేతృత్వంలోని మహాకూటమి ఘోర ఓటమి పాలయింది. ఈ ఫలితాలతో ఆర్​జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు.

ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన ఆహారం తీసుకోవడం లేదని రాంచీలోని రిమ్స్‌లో లాలూకు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు.

ఆహారం తీసుకోకపోతే వైద్యానికి ఇబ్బంది కలుగుతుందని.. పలుమార్లు తాము వారిస్తే మే 26న భోజనం చేసినట్లు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న వైద్యుడు ఉమేష్‌ ప్రసాద్‌ చెప్పారు.

బిహార్‌లో కాంగ్రెస్‌-ఆర్జేడీ కూటమిలో కాంగ్రెస్‌కు కేవలం ఒక స్థానం దక్కగా, ఆర్జేడీ సున్నాకే పరిమితమైంది. రాష్ట్రంలోని 40 స్థానాలకు గాను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 39 స్థానాలను గెలుచుకుంది.

1997లో ఆర్​జేడీ పార్టీ ఆవిర్భవించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో బిహార్​లో ఒక్క పార్లమెంటు సీటు కూడా గెలవకపోవడం ఇదే మొదటిసారి. ఝార్ఖండ్​లో వరుసగా రెండోసారి పార్టీ సున్నాకే పరిమితమైంది.

ఎప్పుడూ అందర్ని నవ్విస్తూ.. ఛలోక్తులు విసిరే లాలూ... పశుగ్రాస కుంభకోణం కేసులో ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్నారు. లాలూ లేకుండా.. పార్టీ ఎన్నికలకు వెళ్లడం ఇదే మొదటిసారి. ఆయన భార్య రబ్రీ దేవీ, కుమారుడు తేజస్వీ యాదవ్​ ప్రస్తుతం పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎన్నోఏళ్ల పాటు లాలూ ప్రాతినిధ్యం వహించిన సరన్​ లోక్​సభ సీటునూ ఆర్​జేడీ ఈసారి గెలవలేకపోయింది.

జనతా దళ్​ యునైటెడ్​(జేడీయూ), రాష్ట్రీయ జనతా దళ్​... ఒకప్పుడు బద్ధశత్రువులు. అనూహ్యంగా 2015 శాసనసభ ఎన్నికల కోసం ఒక్కటయ్యాయి. జట్టుగా పోటీచేసి గెలిచాయి. జేడీయూ-ఆర్జేడీ పొత్తు ఎంతోకాలం కొనసాగలేదు. 2017 జులైలో లాలూతో తెగదెంపులు చేసుకున్నారు బిహార్​ సీఎం నితీశ్​ కుమార్​. తిరిగి ఎన్డీఏలో చేరారు.

AP Video Delivery Log - 0900 GMT News
Monday, 27 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0839: Japan Abe NKorea AP Clients Only 4212790
Abe: NKorea missile tests violate U.N. resolutions
AP-APTN-0804: Japan Trump Iran AP Clients Only 4212788
Trump: Iran would like to make a deal
AP-APTN-0751: France Renault Fiat 24 News Access Only. Must Courtesy BFMTV 4212787
Fiat Chrysler proposes merger with Renault
AP-APTN-0737: Japan Trump Trade AP Clients Only 4212785
Trump: US not ready to make a trade deal with China
AP-APTN-0713: Japan Trump NKorea AP Clients Only 4212776
Trump 'not bothered' by NKorea missile launches
AP-APTN-0708: China Huawei No access mainland China 4212775
Huawei CEO: ready for 'protracted battle' with US
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : May 27, 2019, 5:32 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.