'ఛలో రాజ్‌భవన్' పిలుపుతో బెంగళూరులో వందల మంది నిరసనల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ మద్దతుతో బెంగళూరులోని నేషనల్ కళాశాల మైదానం నుంచి ఫ్రీడమ్ పార్క్ వరకు, అక్కడి నుంచి రాజ్‌భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. శివకుమార్‌కు మద్దతుగా ప్లకార్డులు, ఆయన ఫోటోలు పట్టుకుని భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ర్యాలీ చేపడుతున్న ప్రాంతాల్లో పెద్దఎత్తున బలగాలను మోహరించింది రాష్ట్ర ప్రభుత్వం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది.
మద్దతుదారులకు కృతజ్ఞతలు..
తనకు మద్దతుగా నిలిచిన పార్టీ నాయకులు, నిరసనకారులకు కృతజ్ఞతలు తెలిపారు శివకుమార్. ఆందోళనలు శాంతియుతంగా చేపట్టాలని కోరారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఉద్ఘాటించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని.. న్యాయవ్యస్థపై తనకు పూర్తి నమ్మకముందని ట్వీట్ చేశారు డీకే.
ఈనెల 3న అరెస్ట్...
డీకే శివకుమార్‌ను ఈనెల 3న మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేసింది ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. ఇదే కేసుకు సంబంధించి ఆయన కుమార్తెకూ సమన్లు జారీ చేసింది ఈడీ. రేపు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
ఇదీ చూడండి: రైతులు, చిరు వ్యాపారులకు పింఛను రేపటి నుంచే!