ETV Bharat / bharat

లాక్​డౌన్​ ఉన్నా షిరిడీ సాయి ఆలయానికి విరాళాల వెల్లువ - ఆన్​లైన్

షిరిడీ సాయిబాబా ఆలయానికి ఆన్​లైన్​లో పెద్ద మొత్తంలో విరాళాలు అందాయి. కరోనా మహమ్మారి కారణంగా గుడి మూసేయడం వల్ల భక్తులు అంతర్జాలం ద్వారా రూ.1.90 కోట్లు కానుకలుగా సమర్పించుకున్నారు.

Shirdi Saibaba Temple receives online donation of over Rs 1.90 cr
ఆన్​లైన్​లో బాబా ఆలయానికి రూ.1.90 కోట్ల విరాళాలు
author img

By

Published : Apr 5, 2020, 1:30 PM IST

షిరిడీ సాయిబాబా ఆలయానికి ఆన్​లైన్​లో భారీగా విరాళాలు అందాయి. కరోనా కారణంగా మార్చి 17న దేవాలయం మూత పడింది. అప్పటి నుంచి ఈనెల 3వ తేదీ వరకు ఆన్​లైన్​లో రూ. 1.90 కోట్ల విరాళాలు అందాయి.

లాక్​డౌన్​ కారణంగా భక్తులకు ప్రవేశం లేనప్పటికీ షిరిడీలో పూజలు, ప్రార్థనలు యథావిధిగా జరుగుతున్నాయి.

శ్రీరామనవమికి అధికంగానే..

శ్రీరామ నవమి పూజా కార్యక్రమాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఈ మూడు రోజుల్లో భక్తులు ఆన్​లైన్​లో రూ. 23 లక్షలు బాబాకు సమర్పించుకున్నారు.

రూ. 51 కోట్లు విరాళం ఇచ్చిన ట్రస్ట్​

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి శ్రీ షిరిడీబాబా సంస్థాన్ ట్రస్ట్ రూ. 51 కోట్ల విరాళం అందించింది.

ఇదీ చదవండి: చిన్న పిల్లల్లో కరోనా భయాలు తగ్గించండి ఇలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.