సాయిబాబా జన్మస్థలంపై నెలకొన్న వివాదం సద్దుమణిగేలా కనిపించడం లేదు. మరాఠ్‌వాడా ప్రాంతంలోని పాథ్రీలోనే సాయిబాబా జన్మించాడని చెబుతున్న ఆ గ్రామస్థులు... మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ఈ రోజు సమావేశం కానున్నారు. శిరిడీ గ్రామస్థులతో సోమవారం జరిపిన చర్చల్లో ఉద్ధవ్ ఠాక్రే.. పాథ్రీ గురించి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్లు శివసేన ఎంపీ సదాశివ్ లోఖండే ప్రకటించారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఠాక్రే ధ్రువీకరించలేదు.
ఈ చర్చలకు శిరిడీ గ్రామస్థులతో పాటు సీఎం తమనూ ఆహ్వానించి ఉండాల్సిందని పాథ్రీ గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సాయిబాబా పాథ్రీలోనే జన్మించినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని స్థానిక ఎమ్మెల్యే సురేష్ వార్పుడ్‌కర్ తెలిపారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా సీఎంను కోరతామని వెల్లడించారు.
ఇదీ చూడండి: గుర్రం పేడలో బంగారం స్మగ్లింగ్.. పట్టేసిన పోలీసులు!