ETV Bharat / bharat

చూపులేకున్నా ఆ చిన్నారి గాత్రం అమోఘం - blind

కంటిచూపు లేకపోయినా.. తనకు సంగీతంపై ఉన్న మక్కువే ఆమెను ఇప్పుడు గొప్ప స్థాయిలో నిలిపింది. ఆమె ఎవరో కాదు కొద్ది రోజుల క్రితం స్కూల్​ యూనిఫాంలో పాట పాడి సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన చిన్నారి అనన్య.  ప్రస్తుతం ఆ పాప ఓ సినిమాలో పాడబోతోంది.

అంధురాలైనా అద్భుత గాయని ఆ చిన్నారి
author img

By

Published : Sep 6, 2019, 4:48 PM IST

Updated : Sep 29, 2019, 4:07 PM IST

అంధురాలైనా అద్భుత గాయని ఆ చిన్నారి
సామాజిక మాధ్యమాలు కొందరి జీవితాలను అద్భుత మలుపు తిప్పుతాయి. చాలా సందర్భాల్లో అది నిరూపితమైంది. ఇటీవలే బంగాల్​లోని రణఘాట్​ రైల్వే స్టేషన్​లో ఉండే రేణూ మోండల్​ అనే మహిళ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. ఇదే సోషల్​ మీడియా మరో గాయనిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఆమె ఎవరో కాదు.. కేరళలోని కన్నూర్​కు చెందిన ఎనిమిదేళ్ల అనన్య.

కొద్ది రోజుల క్రితం ఓ అంధ బాలిక పాఠశాల యూనిఫాంలో 'ఉయరే' అనే మళయాలి చిత్రంలోని 'నీ ముకిలో' అనే పాటను పాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. చిన్నారి గాత్రానికి దేశ నలుమూలల నుంచి అభినందనలు అందాయి. ఆ చిన్నారే అనన్య.

ఉయారే చిత్రంలోని పాటను పాప పాడిన తీరుకు ముగ్ధుడైన ప్రముఖ మళయాల సంగీత దర్శకుడు బిజిబాల్​ అనన్య చిన్నారికి తన తదుపరి సినిమాలో అవకాశం ఇవ్వాలని నిర్ణయించాడు. అనన్య ఇప్పటికే చాలా రియాలిటీ షోలల్లో పాల్గొని తన గాత్రాన్ని వినిపించింది.

కేరళలోని కన్నూర్​కు చెందిన పుష్పాన్​, ప్రజితల చిన్నకూతురు అనన్య. పుట్టుకతోనే చూపులేదు. పాపకు ఐదేళ్ల వయసులో రేడియోలో పాటలు వింటూ తిరిగి అంతే మధురంగా పాడటాన్ని గుర్తించారు తల్లిదండ్రులు. చిన్నారికి సంగీతం పట్ల ఉన్న ఆసక్తిని గుర్తించి మ్యూజిక్​ తరగతులకు పంపించారు. ప్రస్తుతం సంగీత పాఠాలు నేర్చుకుంటున్న చిన్నారికి కేరళతో పాటు దేశవ్యాప్తంగా ప్రసంశలు అందుతున్నాయి.

ఇదీ చూడండి: కళాశాల విద్యార్థిగా మారిన 103 ఏళ్ల వృద్ధుడు!

Intro:Body:

c

Conclusion:
Last Updated : Sep 29, 2019, 4:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.