ETV Bharat / bharat

జామియా కేసులో షార్జీల్​పై దేశద్రోహం అభియోగం - caa riots latest update

జామియా అల్లర్ల కేసులో అరెస్టయిన షార్జీల్ ఇమామ్​పై దిల్లీ కోర్టులో అదనపు ఛార్జ్​షీట్ దాఖలు చేశారు పోలీసులు. అల్లర్లకు ముందు విద్వేష ప్రసంగాలు చేసినట్లు ఆరోపిస్తూ దేశద్రోహం కేసును నమోదు చేసినట్లు తెలిపారు.

DL-RIOTS-SHARJEEL-CHARGESHEET
జామియా అల్లర్ల కేసులో 'షార్జీల్​'పై ఛార్జిషీటు
author img

By

Published : Apr 18, 2020, 3:51 PM IST

జామియా అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎన్​యూ మాజీ విద్యార్థి షార్జీల్​ ఇమామ్​పై దిల్లీ కోర్టులో అదనపు అభియోగ పత్రం దాఖలు చేశారు పోలీసులు. ప్రజలను రెచ్చగొట్టేలా అతను చేసిన ప్రసంగాలు అల్లర్లకు దారి తీశాయని ఆరోపించారు. ఈ మేరకు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడని పేర్కొంటూ ఛార్జిషీట్​లో షార్జీల్​పై సెక్షన్​ 124ఏ (దేశద్రోహం), 153ఏ(రెండు వర్గాల మధ్య గొడవకు ప్రేరేపించడం) కింద అభియోగాలు మోపారు దిల్లీ పోలీసులు.

సీఏఏకు వ్యతిరేకంగా డిసెంబర్ 15న జామియా విద్యార్థులు చేపట్టిన నిరసన ర్యాలీ హింసాయుతమైంది. ఈ అల్లర్లలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

మరో రెండు రాష్ట్రాల్లోనూ..

షార్జీల్​పై దిల్లీతో పాటు మణిపుర్​, అరుణాచల్​ప్రదేశ్​ పోలీసులు కూడా కేసులు నమోదు చేశారు. అసోంకు రాకపోకలు నిలిపేసి.. ఈశాన్య రాష్ట్రాలను దేశం నుంచి వేరు చేయాలన్న షార్జీల్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఎఫ్​ఐఆర్ నమోదు చేశారు.

ఇదీ చూడండి: దేశద్రోహం కేసులో 'షార్జీల్​ ఇమామ్'​ అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.