ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు షాహీన్‌బాగ్ లోని సీఏఏ వ్యతిరేక ఉద్యమకారులు. తమతో కలసి ప్రేమికుల రోజులో పాల్గొనాలని ప్రధాని మోదీకి ఆహ్వానం పలికారు. ఈ మేరకు సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా గత డిసెంబర్ 15వ తేది నుంచి నిరసనల్లో పాల్గొంటున్న ఉద్యమేకారులు మోదీ లక్ష్యంగా ఓ ప్రేమ గీతాన్ని విడుదల చేశారు. ప్రధానికి ఓ బహుమతిని సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
"మోదీజీ షాహీన్బాగ్కు వచ్చి మాతో సంభాషించి మీ బహుమతి తీసుకెళ్లండి. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా ఎవరైనా వచ్చి మాతో మాట్లాడవచ్చు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏమీ జరగడం లేదని వారు మమ్మల్ని ఒప్పించగలిగితే మేం మా ఆందోళన విరమిస్తాం."
-సయ్యద్ తాసీర్ అహ్మద్, షాహీన్‌బాగ్ ఉద్యమకారుడు
పొరుగుదేశాల నుంచి వచ్చే మైనారిటీలకు భారత పౌరసత్వం కల్పిస్తామని, ఎవరి పౌరసత్వాన్ని తొలగించబోమని ప్రభుత్వం చెబుతోందని.. అయితే దీనిద్వారా దేశానికి ఏవిధంగా మేలు జరుగుతుందో వివరించడం లేదని వ్యాఖ్యానించారు ఉద్యమకారులు. నిరుద్యోగం, పేదరికం, ఆర్థికమాంద్యం వంటి వాటిని సీఏఏ ఎలా పరిష్కరించగలదని ప్రశ్నించారు.
ఇదీ చూడండి: 'చిన్నమ్మ'కు గుర్తుగా రెండు ప్రభుత్వ సంస్థలకు నామకరణం