పౌర నిరసనలతో దేశం అట్టుడుకుతున్న తరుణంలో పారసత్వ చట్ట సవరణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్రం సన్నద్ధమైంది. ఇందులో భాగంగా రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సతీశ్ పోనియా ప్రకింటించారు. ఈ ర్యాలీలో 50వేలకుపైగా ప్రజలు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్టు తెలిపారు.
పాకిస్థాన్ నుంచి భారీ సంఖ్యలో వచ్చిన హిందువులు.. రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో నివసిస్తున్నందున ఆ ప్రాంతాన్ని ర్యాలీ నిర్వహణకు ఎంపిన చేసినట్టు వెల్లడించారు పోనియా.
సీఏఏ...
2014 డిసెంబర్ 31 ముందు వరకు పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర ప్రజలకు పౌరసత్వం కల్పించడానికి సంకల్పించిన సీఏఏను పార్లమెంట్ ఆమోదించింది. దీనితో దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఈశాన్య భారతంలో మొదలైన నిరసనలు.. యావత్ భారతాన్ని కుదిపేస్తున్నాయి. పలుచోట్ల హింసకు దారితీశాయి.
ఇదీ చూడండి: ప్రజలను కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోంది: అమిత్ షా