అంతర్గత భద్రతా వ్యవహారాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం సమీక్ష నిర్వహించారు. ఇందులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, నిఘా విభాగాధిపతి రాజీవ్ జైన్ తదితరలు పాల్గొన్నారు.
జమ్ముకశ్మీర్లో తాజా పరిస్థితులు సహా సరిహద్దు ప్రాంతాల్లోని వాతావరణంపై అధికారులు హోంమంత్రికి సమాచారం అందించారు.
హోంశాఖలో తరచుగా సమీక్షా సమావేశాలు జరుగుతూ ఉంటాయి. నిఘా సంస్థ సహా అనేక విభాగాల నుంచి సమాచారం పొందుతారు హోంమంత్రి.
హోంశాఖ మంత్రిగా అమిత్ షా గత శనివారమే బాధ్యతలు చేపట్టారు.
ఇదీ చూడండి: 'సైనికుల త్యాగాలను దేశం ఎన్నటికీ మరవదు'