దిల్లీలో కరోనా కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్వయంగా రంగంలోకి దిగారు. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆరోగ్యశాఖమంత్రి హర్షవర్ధన్, విపత్తు నిర్వహణ శాఖ, ఆరోగ్యశాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.
దిల్లీలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు అక్కడ 39,000 కేసులు, 1200కుపైగా మరణాలు నమోదయ్యాయి. దీనితో ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అమిత్‌షా సమీక్ష నిర్వహించారు. అలాగే దిల్లీలో అందుబాటులో ఉన్న కరోనా ఆసుపత్రులు, పడకలు, వైరస్ పరీక్ష కేంద్రాలు, ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి లాంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు.
మేయర్లతో సమావేశం..
ఇవాళ సాయంత్రం అమిత్ షా.. దిల్లీలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లతో సమావేశం కానున్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు.
ఇదీ చూడండి: దేశంలో 24 గంటల్లో 11,929 కేసులు, 311 మరణాలు