ETV Bharat / bharat

"యువతను భయపెట్టడం ఆపండి" - rahul gandhi

రాహుల్​ గాంధీ​పై భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్​ షా తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం బెంగళూరులో జరిగిన కాంగ్రెస్​ సభలో మోదీకి అనుకూలంగా నినాదాలు చేసిన యువకులను అరెస్ట్​ చేయటమేంటని రాహుల్​ను ప్రశ్నించారు. యువతను బయపెట్టడం మానుకోవాలని సూచించారు. అది రాజకీయ విలువలను తగ్గిస్తుందని పేర్కొన్నారు.

భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్​ షా
author img

By

Published : Mar 19, 2019, 2:22 PM IST

Updated : Mar 19, 2019, 8:54 PM IST

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీపై భాజపా అధ్యక్షుడు అమిత్​ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం బెంగళూరులో జరిగిన కాంగ్రెస్​ సభలో మోదీకి అనుకూలంగా నినాదాలు చేసిన యువకుల అరెస్ట్​పై షా ఘాటుగా స్పందించారు. యువకులను బెదిరించడం ఆపాలని సూచించారు. అది కాంగ్రెస్​ రాజకీయ విలువలను తగ్గిస్తుందని రాహుల్​కు చెప్పారు. యువతే భవిష్యత్తు నిర్ధేశకులని పేర్కొన్నారు.

  • Hugs for ‘Tukde Tukde’ gang and arrest of peaceful youth raising pro-Modi slogans?

    Where are the champions of ‘Free Speech’?

    Yuvraj of CONgress must know ‘जिस ओर युवा चलता है उस ओर युग चलता है'।

    Stop intimidating youth of India, which has rejected your brand of politics. https://t.co/AXqeyihKJy

    — Chowkidar Amit Shah (@AmitShah) March 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"జేఎన్​యూలో దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని మీరు కౌగిలించుకుంటారు. కానీ మోదీకి అనుకూలంగా నినాదాలు చేసిన యువకులను అరెస్ట్​ చేస్తారా? స్వతంత్రంగా మాట్లాడేవారెక్కడున్నారు? అక్కడ యువకులు చేసిందేమిటో కాంగ్రెస్​ రాకుమారుడు తెలుసుకోవాలి. భారతదేశ యువతను భయపెట్టడం ఆపాలి. అది మీ రాజకీయ విలువలను తగ్గిస్తుంది" - అమిత్​ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు.

సోమవారం బెంగళూరులోని మన్యత టెక్​ పార్క్​లో మోదీకి అనుకూలంగా నినాదాలు చేసిన వారిని రాష్ట్ర పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆ దృశ్యాలను కర్ణాటక భాజపా ట్విటర్​లో పంచుకుంది. ఆ ట్వీట్​ను ట్యాగ్​ చేస్తూ అమిత్​ షా ఈ ఆరోపణలు చేశారు.

"ఇది కాంగ్రెస్​-జేడీఎస్​ పాలిత రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిస్థితి. పౌరుల భావవ్యక్తీకరణను అణిచివేస్తున్నారు. రాష్ట్రంలో స్వేచ్ఛను అణిచివేసే నియంతృత్వ పాలన సాగుతోంది." - కర్ణాటక భాజపా

ఇదీ చూడండీ:ఓట్ల భారతంలో 'ఇతరుల'కు చోటేది?

AP Video Delivery Log - 0800 GMT News
Tuesday, 19 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0758: Zimbabwe Cyclone AP Clients Only 4201610
Deadly Cyclone Idai brings devastation to Zimbabwe
AP-APTN-0720: New Zealand Guns No access New Zealand 4201609
New Zealanders surrender their guns to police
AP-APTN-0638: New Zealand Tributes AP Clients Only 4201608
Mourning at makeshift shrine to New Zealand victims
AP-APTN-0618: Bangladesh Violence No access Bangladesh 4201603
Bangladesh: Several dead in election-linked attack
AP-APTN-0615: US River Flooding No use by US broadcast networks; Part must credit KMOV; No access St. Louis; Part must credit WQAD; No access Davenport, Moline, Rock Island 4201605
Flooding crisis in Mississippi and Missouri basins
AP-APTN-0600: New Zealand PM Religious No access New Zealand 4201602
Ardern meets religious leaders after speech
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 19, 2019, 8:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.