మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్, ఎన్సీపీ నేతలపై ధ్వజమెత్తారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు విషయంలో ఆ పార్టీ నేతలైన రాహుల్, శరద్ పవార్ల వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
"ఆర్టికల్ 370 రద్దు చేసి భాజపా తప్పు చేసిందని రాహుల్ గాంధీ ప్రకటించారు. కశ్మీర్లో హింస చెలరేగుతోందని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన ఆగస్టు 5-6 తేదీల అనంతరం కశ్మీర్‌లోయలో ఒక్క హింసాత్మక ఘటన చెలరేగలేదు, ఒక్కరూ చనిపోలేదు. ఆయన ప్రకటన పాక్‌కు ఉపయోగపడింది. రాహుల్ వ్యాఖ్యల ఆధారంగా పాక్ విదేశాంగ మంత్రి ఐరాసలో ఫిర్యాదు చేశారు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ ప్రకటనలు చేస్తున్నారని రాహుల్‌ను ప్రశ్నిస్తున్నా. కాంగ్రెస్, ఎన్సీపీలు మహారాష్ట్ర ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చినప్పుడు మీరు ఈ అంశమై ప్రశ్నించండి. దేశం ఈ పరిస్థితుల్లో ఉంటే... స్వప్రయోజనాలను పక్కనపెట్టి దేశంకోసం ఉన్నతంగా ఆలోచించలేరా అని రాజకీయ పార్టీలను ప్రశ్నిస్తున్నా."
-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
ఇదీ చూడండి:దేశ వ్యాప్తంగా 'జై జై గణేశా' నామస్మరణ