ETV Bharat / bharat

"అమరులను అవమానిస్తారా,క్షమాపణ చెప్పండి"

కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల బాధ్యుడు శ్యామ్​ పిట్రోడా వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ లక్ష్యంగా భాజపా అధ్యక్షుడు అమిత్​ షా ప్రశ్నల వర్షం కురిపించారు.

అమిత్ షా
author img

By

Published : Mar 23, 2019, 6:53 PM IST

Updated : Mar 24, 2019, 11:35 AM IST

కాంగ్రెస్​పై అమిత్​ షా ధ్వజం
కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల బాధ్యుడు శ్యామ్​ పిట్రోడా వ్యాఖ్యలపై భాజపా అధ్యక్షుడు అమిత్​ షా తీవ్రంగా మండిపడ్డారు. దేశం కోసం అమరులైన వారిని కాంగ్రెస్ అవమానించిందని ధ్వజమెత్తారు. భాజపానే ప్రజల్ని రక్షిస్తోందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అరాచక పాలన సాగుతుందన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లక్ష్యంగా ప్రశ్నలు సంధించారు అమిత్ షా.

"నేను కాంగ్రెస్​ పార్టీని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. మీరు చెప్పిన దాని ప్రకారం.. దేశ ప్రజలను భయాందోళనలకు గురిచేసిన దాడులను సాధారణ ఘటనగా భావిస్తున్నారా? మీ పార్టీ నేత కొంత మంది చేసిన పనికి దేశం(పాకిస్థాన్​) మొత్తం మీద పడాల్సిన అవసరం లేదంటున్నారు. కాంగ్రెస్ దీన్ని అంగీకరిస్తుందా? దేశంలో జరిగే ఉగ్రదాడులకు పాకిస్థాన్​కు​, దాని సైన్యానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పగలదా? ఉగ్రదాడులకు మెరుపుదాడులతో బదులివ్వకూడదని కాంగ్రెస్ చెబుతోంది. చర్చలతోనే పరిష్కరించాలంటోంది. కాంగ్రెస్ చెబుతున్నది సాధ్యమయ్యే చర్యేనా? ఈ మూడు ప్రశ్నలపై ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సమాధానం చెప్పాలి. "
-అమిత్ షా, భాజపా జాతీయాధ్యక్షుడు

జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ భారత వాయుసేనపై అనుమానాలు వ్యక్తం చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు అమిత్​ షా. ఓ విశ్వవిద్యాలయంలో దేశ వ్యతిరేక నినాదాలు చేస్తున్న వారికి మద్దతు పలికి మీరేంటో తెలియజెప్పారని విమర్శించారు.

రాజకీయంలో వ్యక్తిగత వ్యాఖ్యలు కూడా ఉంటాయా అని ఎద్దేవా చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్ పెట్టింది పేరని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్​లో చాలా మంది నాయకులు ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని, వారందరి తరఫున దేశ ప్రజలకు రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అమిత్ షా.

ఇదీ చూడండి:హోదా ఎందుకు ఇవ్వరు?: ముఖాముఖిలో రాహుల్​

New Delhi, Mar 23 (ANI): A study recently found that the weight loss drug called Phentermine, which can only be used for a short while, may also be safe and effective for longer-term treatment. The inexpensive drug Phentermine is FDA approved to use. However, it can only be used for a period of three months and no longer than that. The researchers found that people who stayed on phentermine longer experienced greater weight loss than those who took the drug for three months or less, and longer-term use was not associated with increases in blood pressure or increased risk of heart attack, stroke or death. However, the researchers cautioned that phentermine is a stimulant and should not be used in people with a history of heart disease, stroke or uncontrolled high blood pressure. But for those with low cardiac risk, normal blood pressure or high blood pressure that is well treated, it could be a good and affordable option.
Last Updated : Mar 24, 2019, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.