ETV Bharat / bharat

'సెక్స్ వర్కర్లకు నగదు బదిలీ చేయాలి' - సెక్స్​ వర్కర్లకు నగదు బదిలీ

సెక్స్​ వర్కర్లకు నగదు బదిలీకి అవసరమైన మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తమిళనాడు, తెలంగాణకు చెందిన 1.2లక్షల సెక్స్​ వర్కర్లపై చేసిన సర్వేలో 96 శాతం మంది కరోనా మహమ్మారి కారణంగా జోవనోపాధి కోల్పోయినట్లు వెల్లడైందని స్వచ్ఛంద సంస్థ తరఫున వాదనలు వినిపించిన న్యాయమూర్తి కోర్టుకు తెలిపారు.

Sex workers need cash transfers
'సెక్స్ వర్కర్లకు నగదు బదిలీ చేయాలి'
author img

By

Published : Sep 23, 2020, 7:42 AM IST

ఎలాంటి ధ్రువపత్రంతో సంబంధం లేకుండా సెక్స్​ వర్కర్లకు నెలకు సరిపడా రేషన్​, నగదు బదిలీకి అవసరమైన మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్రానికి, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కరోనా మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా సెక్స్​ వర్కర్లు జీవనోపాధి కోల్పోయారని, వారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ కోల్​కతాకు చెందిన దర్బార్ మహిళా సమన్వయ్ కమిటీ అనే స్వచ్ఛంద సంస్థ వేసిన పిటిషన్​ను విచారించింది ఎల్​.నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం. మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంలో రాష్ట్రాలు, కేంద్రాలు వెంటనే మార్గదర్శకాలు రూపొందించాలని పేర్కొంది.

కోర్టు నియమించిన కోర్టు సలహాదారుడు జయంత్​ భూషణ్​.. సెక్స్​వర్కర్లు పడుతున్న ఇబ్బందులను న్యాయస్థానానికి వివరించారు. స్వచ్ఛంద సంస్థ తరఫున వాదనలు వినిపించిన న్యాయమూర్తి ఆనంద్​ గ్రోవర్​.. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తమిళనాడు, తెలంగాణకు చెందిన 1.2లక్షల సెక్స్​ వర్కర్లపై చేసిన సర్వేలో 96 శాతం మంది జోవనోపాధి కోల్పోయారని వెల్లడైందని కోర్టుకు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.