ETV Bharat / bharat

ప్రభుత్వానికి రూ.లక్షల్లో బాకీపడ్డ మంత్రులు

కొంత మంది కేంద్రమంత్రులు దిల్లీలో ప్రభుత్వం కేటాయించిన భవంతుల బకాయిలు చెల్లించలేదు. సమాచార హక్కు(ఆర్టీఐ) చట్టం కింద అడిగిన ప్రశ్నకు కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ ఈమేరకు సమాధానం ఇచ్చింది.

అధికారిక నివాసాల బకాయిలు చెల్లించని మంత్రులు!
author img

By

Published : May 19, 2019, 10:03 PM IST

దిల్లీలో కొంతమంది కేంద్రమంత్రులు ప్రభుత్వం కేటాయించిన అధికారిక భవనాల బకాయిలు చెల్లించలేదని తెలిపింది కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఎవరెవరు ఎంత బకాయిలు చెల్లించాలన్న సమాచారాన్ని ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు అధికారులు.

విజయ్​ గోయెల్ రూ.3 లక్షలు​, ప్రకాశ్ జావడేకర్ రూ. 86,923​, నిర్మలా సీతారామన్ రూ. 53,276​, సుష్మా స్వరాజ్ రూ. 98,890 చెల్లించాలని ప్రకటించింది. వీరితో పాటు కేంద్ర సహాయమంత్రి ముక్తార్​ అబ్బాస్​ నక్వీ(రూ.1.46 లక్షలు), జితేంద్ర సింగ్(రూ.3.18 లక్షలు), కేంద్ర వ్యవసాయ సహాయమంత్రి గజేంద్ర సింగ్​(రూ. 2.8 లక్షలు) ప్రభుత్వ భవనాల బకాయిలు చెల్లించలేదని స్పష్టం చేసింది.

బకాయిలు చెల్లించిన మంత్రులు...

బకాయిలు చెల్లించని వారితో పాటు చెల్లించిన వారి జాబితాను ఇచ్చారు అధికారులు. రాజ్​నాథ్​ సింగ్​, నితిన్​ గడ్కరీ, గిరిరాజ్​ సింగ్​, బాబుల్​ సుప్రియో, హర్షవర్ధన్​, మనోజ్​ సిన్హా, నరేంద్ర సింగ్​ తోమర్​, మహేశ్​ శర్మ, జయంత్​ సిన్హా, రవిశంకర్​ ప్రసాద్​, ఉమా భారతి, స్మృతి ఇరానీ తదితరులు బకాయిలు పూర్తిగా చెల్లించారు. మంత్రులందరికీ భవనాలను కేటాయించే... డైరెక్టరేట్​ ఆఫ్​ ఎస్టేట్స్​ వీరందరికీ 'నో డిమాండ్​ సర్టిఫికేట్​(ఎన్​డీసీ)' జారీ చేసింది.

Intro:Body:

asas

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.