ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా హైకోర్టు సీజేలు, జడ్జీలు బదిలీ

పలు హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులు(సీజే), న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు ఓ ప్రకటన విడుదల చేసింది. ఒడిశా హైకోర్టు సీజే మధ్యప్రదేశ్​కు, మద్రాస్​ హైకోర్టు న్యాయమూర్తి గుజరాత్​కు బదిలీ అయ్యారు. ఐదుగురు న్యాయమూర్తులకు సీజేలుగా పదోన్నతి లభించింది.

author img

By

Published : Dec 16, 2020, 5:16 PM IST

several High Court CJs and judges Transfer across the country
దేశవ్యాప్తంగా హైకోర్టు సీజేలు, న్యాయమూర్తుల బదిలీ

దేశవ్యాప్తంగా పలువురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులను బదిలీ చేసింది సుప్రీంకోర్టు. ఈ నెల 14న జరిగిన సుప్రీం కొలీజియం సమావేశంలో ఈమేరకు ఖరారు చేసినట్లు ప్రకటన విడుదల చేసింది.

ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రఫీక్​ మధ్యప్రదేశ్​కు బదిలీ అయ్యారు. సిక్కిం హైకోర్టు సీజేను ఆంధ్రప్రదేశ్​కు బదిలీ చేస్తూ సుప్రీం కొలీజియం నిర్ణయం తీసుకుంది.

మద్రాస్​ హైకోర్టు న్యాయమూర్తిని గుజరాత్​కు బదిలీ చేశారు.

ఎవరెవరు ఎక్కడ..?

  • ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మొహమ్మద్‌ రఫీక్‌ మధ్యప్రదేశ్‌కు బదిలీ
  • సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ.కె.గోస్వామి ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ
  • మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వినీత్‌ కొఠారి గుజరాత్‌కు బదిలీ.
  • తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌ ఉత్తరాఖండ్‌కు బదిలీ
  • ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.కె.మహేశ్వరి సిక్కింకు బదిలీ
  • మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ.
  • జమ్ముకశ్మీర్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజేష్‌ బిందాల్‌ కోల్‌కతాకు బదిలీ
  • కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీ ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ.
  • మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌ చంద్ర శర్మ కర్ణాటకకు బదిలీ

ఐదుగురికి పదోన్నతి

  • పంజాబ్‌, హరియాణా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ మురళీధర్‌కు ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి.
  • దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీకి తెలంగాణ ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి
  • కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీబ్‌ బెనర్జీకి మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి
  • అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పంకజ్‌ మిత్తల్​కు జమ్ముకశ్మీర్‌ ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి
  • ఉత్తరాఖండ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధాంశు ధులియాకు గువాహటి ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.