గుజరాత్లో విషాదం చోటు చేసుకుంది. ఓ హోటల్ సెప్టిక్ ట్యాంక్‌లోకి వెళ్లిన ఏడుగురు ఊపిరాడక మరణించారు. ఈ ఘటన వడోదరకు 30 కిలోమీటర్ల దూరంలోని ఫర్తీకుయ్ గ్రామంలో జరిగింది.
హోటల్లోని సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు నలుగురు పారిశుద్ధ్య కార్మకులు వెళ్లారు. అయితే ఓ వ్యక్తి మాత్రం బయటకు రావడానికి ఇబ్బంది పడ్డాడు. ఊపిరాడక మరణించాడు. అతడిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో మిగతా ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ నలుగురి కోసం ట్యాంక్‌లోకి దిగిన మరో ముగ్గురు హోటల్ సిబ్బంది కూడా ఊపిరాడక చనిపోయారు.
ఇదీ చూడండి: ఐదుగురు జవాన్లను బలిగొన్న మావోలు