గుజరాత్ సురేంద్రనగర్ జిల్లాలోని ఖేర్వా గ్రామం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డంపర్, కారు ఢీకొన్న ఈ ఘటనలో ఏడుగురు సజీవ దహనమయ్యారు.
వేగంగా వస్తున్న డంపర్ ఢీకొట్టిన వెంటనే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు.. తప్పించుకునే వీలు లేక అగ్నికి ఆహుతయ్యారు. ఘటన అనంతరం డంపర్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.