పుణెలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు.. చెట్టును ఢీకొని ఏడుగురు మరణించారు. మరొకరు గాయపడ్డారు. మహారాష్ట్రలోని ముంబయి- బెంగళూరు జాతీయ రహదారిపై సతార నగర సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కర్ణాటక ధార్వాడ్ నుంచి పుణె విమానాశ్రయం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి 12 గంటల 45 నిమిషాల సమయంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టినట్టు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా భావిస్తున్నారు.