ETV Bharat / bharat

డిసెంబర్‌ కల్లా సీరమ్‌ వ్యాక్సిన్‌: పునావాలా - కరోనా వ్యాక్సిన్ వార్తలు

కరోనా వైరస్ టీకా డిసెంబర్​ నాటికి సిద్ధమవ్వచ్చని సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈఓ అధార్ పూనావాలా తెలిపారు. వచ్చే ఏడాది రెండు లేదా మూడో త్రైమాసికానికి 10 కోట్ల డోసులు అందుబాటులోకి రావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ఇది బ్రిటన్​లో నిర్వహిస్తున్న ట్రయల్స్​, డీసీజీఐ ఆమోదంపై ఆధారపడి ఉందని తెలిపారు.

seerum vaccine
సీరమ్‌ వ్యాక్సిన్‌
author img

By

Published : Oct 28, 2020, 9:16 PM IST

పుణెకు చెందిన సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ రూపొందిస్తున్న కరోనా వైరస్‌ టీకా.. డిసెంబర్‌ కల్లా సిద్ధమవ్వచ్చని ఆ సంస్థ సీఈవో అధార్‌ పునావాలా స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ జాతీయ మీడియాకు వెల్లడించారు. టీకా అందుబాటులోకి వచ్చే సరైన సమయం బ్రిటన్​లో నిర్వహిస్తున్న ట్రయల్స్‌, డీసీజీఐ ఆమోదంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.

"అత్యవసర అనుమతికి దరఖాస్తు చేసుకోకపోతే.. డిసెంబర్​లో క్లినికల్ ట్రయల్స్ పూర్తిచేసి వచ్చే ఏడాది జనవరి నాటికి భారత్‌లో వ్యాక్సిన్​ను తీసుకువస్తాం. ఆ సమయానికి యూకేలోనూ ట్రయల్స్‌ పూర్తవుతాయి. టీకాపై వారి అధ్యయనానికి సంబంధించిన సమాచారాన్ని పంచుకొని సురక్షితమేనని అనుకున్నప్పుడు రెండు మూడు వారాల ముందు అత్యవసర అనుమతికి డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంటాం. అప్పుడు డిసెంబర్‌ నాటికి టీకా అందుబాటులోకి తెస్తాం. కానీ ఆ అంశం కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయిస్తుంది."

- అధార్ పూనావాలా

10 కోట్ల డోసులను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పూనావాలా స్పష్టం చేశారు. అది 2021 రెండు లేదా మూడో త్రైమాసికానికి పూర్తవుతుందన్నారు. వ్యాక్సిన్‌ రెండు డోసులుగా ఉంటుందని.. ఒక్కో డోసుకు మధ్య 28 రోజుల గడువు ఉంటుందని వివరించారు. టీకా ధర గురించి ఇప్పుడే చెప్పలేమని.. ఆ విషయంపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. సీరం వ్యాక్సిన్‌ అనువైన ధరకే లభిస్తుందనే విషయం మాత్రం చెప్పగలనన్నారు.

ఇదీ చూడండి: మిజోరంలో తొలి కరోనా మరణం నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.