ETV Bharat / bharat

టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోరిన సీరం - sii news vaccine

దేశంలో తమ టీకాను అత్యవసరంగా వినియోగించేందుకు అనుమతి కోరుతూ డీసీజీఐకి దరఖాస్తు పెట్టుకుంది సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ ఇండియా​. కరోనా లక్షణాలు ఉన్నవారి మీద తమ వ్యాక్సిన్​ ప్రభావవంతంగా పనిచేస్తోందని పేర్కొంది. భారత్​లో టీకా అనుమతి కోరిన మొదటి దేశీయ సంస్థగా సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా నిలిచింది.

Serum Institute seeks emergency use authorisation for Oxford COVID-19 vaccine Covishield in India
టీకా అత్యవసర వినియోగానికి 'సీరం'​ దరఖాస్తు
author img

By

Published : Dec 7, 2020, 4:09 AM IST

కొవిషీల్డ్​ టీకాను దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతించాలని భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)ను సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ ఇండియా​ కోరింది. ఈ మేరకు ఓ దరఖాస్తును సమర్పించింది. టీకాకు అనుమతి కోరిన మొదటి దేశీయ సంస్థగా సీరం ఇన్​స్టిట్యూట్​ నిలిచింది. ఇప్పటికే.. అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్..‌ భారత్‌లో టీకా అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకుంది.

డీసీజీఐకు సమర్పించిన దరఖాస్తులో టీకా పనితీరుకు సంబంధించిన క్లినికల్‌ డేటాను సీరం ఇన్​స్టిట్యూట్​ వివరించింది. కరోనా వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉన్న రోగుల మీద తాము అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకా సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపింది. దాదాపు 4 కోట్ల టీకా డోసులు వినియోగానికి సీరం సిద్ధం చేసినట్లు.. వ్యాక్సిన్ అభివృద్ధిలో భాగస్వామిగా ఉన్న భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్​ఆర్​) వెల్లడించింది.

ప్రపంచంలో అతిపెద్ద టీకా ఉత్పత్తిదారుగా ఉన్న సీరం ఇన్​స్టిట్యూట్..​ ఆస్ట్రాజెనికా-ఆక్స్‌ఫర్డ్‌ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకాను తయారు చేస్తోంది. ఈ టీకాకు సంబంధించిన మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ దేశంలోని పలు ప్రాంతాల్లో సీరం ఆధ్వర్యంలోనే జరిగాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.