చెన్నైలోని 21.5శాతం మందిలో ఇప్పటికే వైరస్‌కు సంబంధించిన యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్లు ఓ సెరోలాజికల్ సర్వేలో తేలింది. ఈ విషయాన్ని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్(జీసీసీ) వెల్లడించింది.
సర్వేలో భాగంగా జులై నెలలో 12 వేల మంది నుంచి నమూనాలను సేకరించినట్టు జీసీసీ కమిషనర్ ప్రకాశ్ వెల్లడించారు. అయితే.. ఆంక్షలను ఎత్తివేసినప్పటికీ.. కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రకాశ్. మస్కులు ధరించాలని, అనవసరమైన ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించారు.
ఆంక్షల సడలింపుతో కాంటాక్ట్ ట్రేసింగ్ కష్టమవుతుందని ప్రకాశ్ అభిప్రాయపడ్డారు. గతంలో... ప్రతి 100మందిలో 30మందికి కరోనా సోకే ప్రమాదం ఉండగా.. ఇప్పుడు అది 9కి పడిపోయిందన్నారు.
తమిళనాడులో మంగళవారం నాటికి 52,578 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 4.3లక్షలను దాటింది. ఇప్పటివరకు 7,322మంది కరోనా ధాటికి బలయ్యారు.
ఇదీ చూడండి:- దేశంలో మరో 78,357 కేసులు, 1045 మరణాలు