తమిళనాడు సేలం జిల్లాలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. మరణించిన తర్వాత ఫ్రీజర్ శవపేటికలో పెట్టినా.. 75 ఏళ్ల వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఫ్రీజర్ బాక్స్ సంస్థకు చెందిన సిబ్బంది తక్షణ స్పందన వల్ల వృద్ధుడు బతికాడు.
ఇదీ జరిగింది..
సేలంలో నివసించే బాలసుబ్రమణ్యన్ మరణించాడని భావించి అతని సోదరుడు శరవణన్.. సోమవారం ఫ్రీజర్ బాక్స్‌ను అద్దెకు తీసుకున్నాడు. ఆ బాక్స్‌ను తిరిగి తీసుకెళ్లేందుకు మంగళవారం రావాలని సంస్థ ప్రతినిధులకు సూచించాడు. అలా వచ్చిన సిబ్బంది.. అందులోని వ్యక్తి ఊపిరితీసుకోవడాన్ని గమనించారు. వెంటనే ఆ ఫ్రీజర్ నుంచి బాలసుబ్రమణ్యన్ను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. సోదరుల మధ్య ఆస్తి వివాదం నడుస్తోందని తెలిసింది. ఇది హత్యాయత్నమని పోలీసులు అనుమానిస్తున్నారు. శరవణన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: బిడ్డకు జన్మనిచ్చిన 14 రోజులకే విధుల్లోకి కలెక్టర్