ETV Bharat / bharat

నిఘా హెచ్చరికలతో శ్రీనగర్​లో భద్రత కట్టుదిట్టం - Security upped around vital Srinagar installations

జమ్ముకశ్మీర్ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేసే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న నిఘా హెచ్చరికల నేపథ్యంలో రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భద్రతను కట్టుదిట్టం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

నిఘా హెచ్చరికలతో శ్రీనగర్​లో భద్రత కట్టుదిట్టం
author img

By

Published : Sep 28, 2019, 5:21 AM IST

Updated : Oct 2, 2019, 7:27 AM IST

నిఘా హెచ్చరికలతో శ్రీనగర్​లో భద్రత కట్టుదిట్టం

ఉగ్రముప్పు పొంచి ఉందన్న అంచనాల నేపథ్యంలో శ్రీనగర్​లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు అధికారులు. నగరం చుట్టూ నూతన బంకర్లను ఏర్పాటు చేశారు. సైన్యం క్యాంపులు, మిలిటరీ స్టేషన్లు సహా అన్ని చోట్లా భద్రతను పెంచినట్లు అధికారులు వెల్లడించారు. ఆసుపత్రులు, పోలీస్​స్టేషన్లు సహా..గతంలో ముష్కరులు రెండుసార్లు దాడి చేసేందుకు యత్నించిన శ్రీనగర్ విమానాశ్రయంలోనూ ముందు జాగ్రత్త చర్యగా భద్రత పెంచారు. ముఖ్యమైన స్థలాల్లో పలు అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు.

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థలు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా సమావేశాలు నిర్వహించిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

హై అలర్ట్...

సైనిక క్యాంపులు, మిలిటరీ స్టేషన్ల వద్ద హై అలెర్ట్ ప్రకటించారు. బీఎస్​ఎఫ్, సీఆర్​పీఎఫ్ క్యాంపుల వద్దా రక్షణను పెంచినట్లు ఆయా సంస్థల అధికారులు వెల్లడించారు.

అవాంఛిత ఘటనలు జరగకుండా సరిహద్దు సమీపంలోని పోలీస్​స్టేషన్లను అప్రమత్తం​ చేశారు. చెక్​పోస్టులను పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. రాత్రి గస్తీని ముమ్మరం చేశారు.

ఆర్టికల్ రద్దు నుంచి..

ఆగస్టు 5న కశ్మీర్​ స్వయం ప్రతిపత్తి రద్దు ప్రకటనకు ముందు నుంచే పలు ప్రాంతాల్లో చెక్​పోస్ట్​లను ఏర్పాటు చేసిన అధికారులు షిఫ్టుల వారిగా పహారా కాస్తున్నారు. వీటిల్లోని సమస్యాత్మక బంకర్లలోనూ భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.

శ్రీనగర్ సహా కశ్మీర్​ లోయలోని కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాదులు యథేచ్చగా సంచరిస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో చెక్​పోస్ట్​ల ఏర్పాటు వల్ల నగరంలో రాకపోకలపై నిఘా ఉండే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: ఐక్యరాజ్యసమితి వేదికగా 'హద్దు' మీరిన ఇమ్రాన్​..!

New Delhi, Sep 27 (ANI): Union Finance Minister Nirmala Sitharaman held a meeting with secretaries and financial advisors of key selected ministries in the national capital on September 27. The meeting was conducted to review total CAPEX (capital expenditure) by the ministries in 2019-20 till now and to plan for future CAPEX in current financial year. While addressing the media, Nirmala Sitharaman said, "Actual details will be given to you later but 90% of the overdue as on August 23 when I spoke about GST refund, have been cleared. Hopefully, 30-day limit is not crossed and I am sure Revenue Secretary will inform me but even in that we have kept the promise that refunds shall not be delayed." "Capital Expenditure (CAPEX) is on track as per budget target. Government owes only Rs 20,000 crores dues that will be released by first week of October. Have asked all ministries and will ask Central Public Sector Enterprises tomorrow to prepare CAPEX plan for next four quarter," FM added.
Last Updated : Oct 2, 2019, 7:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.