ETV Bharat / bharat

అక్రమ ఆయుధ సరఫరా ముఠా గుట్టు రట్టు

ఉగ్రమూకలకు అక్రమంగా ఆయుధాలు సరఫరా చేస్తోన్న ఓ డీలర్​ను నాగాలాండ్​ పెరెన్​ జిల్లాలో పట్టుకున్నాయి భద్రతా దళాలు. అతని నుంచి తుపాకులు, మందుగుండు సామగ్రితో పాటు ఆయుధాలు తయారు చేసే సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. శనివారం యూఎల్​ఎఫ్​ఏకు చెందిన ముగ్గురు ముష్కరులను అరెస్ట్​ చేశాయి.

security-forces-nabs-arms-dealer
అక్రమ ఆయుధ సరఫరా ముఠా గుట్టు రట్టు
author img

By

Published : Aug 30, 2020, 11:41 AM IST

అక్రమంగా ఆయుధాలు సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశాయి భద్రత దళాలు. నాగాలాండ్​ పెరెన్​ జిల్లాలోని లిలెన్​ గ్రామంలో అక్రమ ఆయుధాల డీలర్​ను అరెస్ట్​ చేశాయి. ఉగ్రకార్యకలాపాలపై సమాచారం మేరకు పెరెన్​ జిల్లా పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో డీలర్ పట్టుబడ్డాడు. నిందితుడి వద్ద నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు భారత సైన్యం తూర్పు కమాండ్​ వెల్లడించింది.

మూడు 12 బోర్​ రైఫిల్స్​, 34 తుటాలు, ఆయుధాలు తయారు చేసే సామగ్రి వంటివి ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నాయి బలగాలు.

- తూర్పు కమాండ్​, భారత సైన్యం

తిరప్​ జిల్లాలోని నోగ్లో సమీపంలో యూఎల్​ఎఫ్​ఏ (ఐ) ఉగ్ర సంస్థకు చెందిన ముగ్గురు కీలక సభ్యులను శనివారం అరెస్ట్​ చేశాయి భద్రత దళాలు. వారి వద్ద నుంచి మూడు చిన్న తుపాకులు, తూటాలతో నిండిన మ్యాగజైన్స్​, యూఎల్​ఎఫ్​ఏ బ్యాడ్జులు స్వాధీనం చేసుకున్నాయి.

ఇదీ చూడండి: కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు ముష్కరులు హతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.