జమ్ము కశ్మీర్లో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రమూకలు ఉన్నాయనే పక్క సమాచారంతో సైనిక బలగాలు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఉగ్రవాదుల రహస్య స్థావరాలు ఛేదించి... భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఆపరేషన్లో భాగంగా దాచూ జైన్‌పొరాలోని ఓ తోటలో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని కనిపెట్టి... 4 బారెల్ గ్రనేడ్ లాంచర్లు, 3 చైనీస్ గ్రనేడ్లు, ఏకే 47 మ్యాగ్జిన్ స్వాధీనం చేసుకున్నారు. ఇంకా తనిఖీలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: 'మహా'లో కరోనా ఉగ్రరూపం- కొత్తగా 9,431 కేసులు