జమ్ములో144 సెక్షన్ ఎత్తివేత- యథాతథంగా కశ్మీర్ - ఆర్టికల్ 370
ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో జమ్మూలో విధించిన 144 సెక్షన్ను ప్రభుత్వం తొలగించింది. శనివారం నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభించాలని జమ్మూ జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. కశ్మీర్‌లో మాత్రం ఇందుకు మరింత సమయం పడుతుందని పోలీసు అధికారులు వెల్లడించారు.
జమ్ముకశ్మీర్ పునర్విభజన, ఆర్టికల్ 370 రద్దు అనంతరం... జమ్మూలో జనజీవనం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో సెక్షన్ 144ను ఎత్తేసి శనివారం నుంచి విద్యాసంస్థలను తెరవాల్సిందిగా జమ్మూ జిల్లా డిప్యూటీ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు.
డోడా, కిశ్త్వాడ్ జిల్లాల్లో అమల్లో ఉన్న కర్ఫ్యూను శుక్రవారం ఎత్తివేశారు. కథువా, సంబా, ఉధమ్పుర్లో ఇప్పటికే విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించారు.
కశ్మీర్ యథాతథమే...
జమ్ములో ప్రశాంత పరిస్థితుల నడుమ 144 సెక్షన్ ఎత్తివేసినా.. కశ్మీర్‌లో మాత్రం ఇందుకు ఇంకా సమయం పడుతుందని శాంతి భద్రతల అదనపు డీజీపీ మునీర్ ఖాన్ వెల్లడించారు. పుంఛ్, రాజౌరీ, రాంబన్ జిల్లాల్లో ఆంక్షలు కొనసాగనున్నాయని స్పష్టం చేశారు. నేడు మరికొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ నిబంధనలు సడలించనున్నట్లు తెలిపారు.
శుక్రవారం రోజు ప్రార్థనలు చేసుకొనేందుకు కశ్మీర్ లోయలో ప్రజలకు మసీదులకు వెళ్లేందుకు అనుమతినిచ్చినట్లు తెలిపారు. కశ్మీర్ ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా పరిస్థితి చక్కదిద్దాలని జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్ అధికారులకు సూచించారు.
భారీగా బలగాల మోహరింపు.. నేవీ అప్రమత్తం
స్వయం ప్రతిపత్తి రద్దు, రాష్ట్ర విభజన కారణంగా జమ్ముకశ్మీర్లో భారీ ఎత్తున బలగాలను మోహరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
తీరం వెంట ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడి దాడులు చేసే అవకాశముందన్న నిఘా వర్గాల హెచ్చరికతో నౌకా దళం అప్రమత్తమైంది. తీర ప్రాంత గస్తీని మరింత పెంచింది. రాడార్ల సాంకేతికత ద్వారా సముద్రంలో అనుమానాస్పద నౌకల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు నౌకాదళ ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి: కలల కశ్మీరం నిర్మిద్దాం రండి: ప్రజలకు మోదీ పిలుపు
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
New Delhi – 9 August 2019
1. People praying at Jama Masjid mosque
2. Dome of mosque
3. Various of people praying
4. SOUNDBITE (Hindi) Abdul Wahid, 66, Delhi resident:
"The question was not of the removal of (Article) 370. The question was about Indian government's promise, it's agreement (with the people of Kashmir)."
5. SOUNDBITE (Hindi) Aftab Uddin, 49, businessman:
"This has been done by force. If they had won their (Kashmiris') hearts, then we would have stood with the government. This was a 70-year-old contract that the government crushed in an unconstitutional way. The government thinks that the situation will improve? (The) situation will not improve."
6. SOUNDBITE (Hindi) Mohammed Ashfaq, 30, tailor:
"If they had to remove (Article) 370 they could have done it after discussing it with the Kashmiris. But instead of talking to them, they have imposed a dictatorship, nothing else."
7. Security outside gates to the mosque
8. SOUNDBITE (Hindi) Mohammed Salim Ansari, 40, parking attendant:
"This was a good move. This is in India, it is India's place. India should keep it. Kashmir thinks that they are separate. They are eating and drinking in India and they take Pakistan's name. So there's no benefit in that."
9. Men exiting mosque after prayers
STORYLINE:
Muslims in New Delhi on Friday spoke of mixed feelings about the Indian government's move to revoke disputed Kashmir's special status.
Speaking after Friday afternoon prayers at the Jama Masjid mosque, 49-year-old Aftab Uddin said he did not support the government's move because it was done by force.
India's government has imposed an unprecedented security lockdown and a near-total communications blackout in the Muslim-majority Kashmir, while revoking its special constitutional status.
Curfew restrictions were said to be eased in Kashmir for Friday prayers, according to a police official, while Pakistan government continued to oppose India's decision.
Jama Masjid has been a centre of regular anti-India protests after Friday prayers.
Authorities will be closely watching for any anti-India protests.
Both Pakistan and India claim all of Kashmir.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.