ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​ రెండో విడత ఎన్నికలు ప్రశాంతం

జమ్ముకశ్మీర్​లో స్థానిక సంస్థల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చోట్ల మినహా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్​ ప్రక్రియ సజావుగా సాగింది. మొత్తం 48.62 పోలింగ్​ శాతం నమోదైంది.

author img

By

Published : Dec 1, 2020, 4:22 PM IST

Updated : Dec 1, 2020, 8:08 PM IST

JK DDC Election UPDATE
జమ్ముకశ్మీర్​ రెండో విడత ఎన్నికలు ప్రశాంతం

జమ్ముకశ్మీర్​లో జిల్లా అభివృద్ధి మండలి(డీడీసీ) ఎన్నికల రెండో విడత పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటల నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు బారులు తీరారు. ఎన్నికలను అడ్డుకునేందుకు ఉగ్రవాదులు యత్నిస్తున్నారన్న సమాచారం నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు.

Second phase of DDC polls in J-K
భద్రతా బలగాల మోహరింపు
Second phase of DDC polls in J-K
థర్మల్​ స్క్రీనింగ్​ నిర్వహిస్తున్న ఎన్నికల సిబ్బంది

కొవిడ్​ నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఓటర్లను భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరికీ థర్మల్​ స్క్రీనింగ్​ నిర్వహించారు.

Second phase of DDC polls in J-K
కొవిడ్​ నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు

జమ్ముకశ్మీర్​లో మొత్తం 48.62 శాతం పోలింగ్​ నమోదైంది. ​

ఇదీ చూడండి: కశ్మీర్​​ లెక్కలు మార్చిన​ డీడీసీ ఎన్నికలు!

బోగస్​ ఓట్లు..

డీడీసీ ఎన్నికల ఓటింగ్​లో అవకతవకలు బయటపడ్డాయి. బందీపొరాలోని గన్​స్టన్​ పోలింగ్​ కేంద్రంలో ఏజెంట్లు బ్యాలెట్​ బాక్స్​లను ఎత్తుకెళ్లారు. బోగస్​ ఓటింగ్​కు పాల్పడినట్లు తెలుస్తోంది.

Second phase of DDC polls in J-K
ఓటు వేసేందుకు బారులు తీరిన జనం

ఇదీ చూడండి: ఫరూక్ అబ్దుల్లా 'రోష్ని'​ భూములపై రాజకీయ రగడ

8 విడతల్లో..

జమ్ముకశ్మీర్​లోని 20 జిల్లాల్లో మొత్తం 280 స్థానాలకు 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్​ 28న ప్రారంభం కాగా డిసెంబర్​ 19 వరకు సాగనున్నాయి. డిసెంబర్​ 22న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

Second phase of DDC polls in J-K
పోలింగ్​ కేంద్రం వద్ద ఓటర్లు

రెండో దశలో మొత్తం 321 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 2142 పోలింగ్​ కేంద్రాల్లో ఓటింగ్​ జరిగింది. ఈ ఫేజ్​లో సుమారు 7.90 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.

అధికరణ 370 రద్దు తర్వాత.. జమ్ముకశ్మీర్​లో జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే.

ఇవీ చూడండి:

ఎన్నికల వేళ ఆంక్షల వలయం- హోటళ్లలోనే నేతలు

కశ్మీర్​లో స్థానిక సమరం- ఎందుకింత ప్రాధాన్యం?

Last Updated : Dec 1, 2020, 8:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.