సార్వత్రిక ఎన్నికల రెండో విడత కోసం వాడీవేడిగా జరిగిన ప్రచారం ముగిసింది. దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఏప్రిల్ 18న రెండో విడత పోలింగ్ జరగనుంది.
97 నియోజకవర్గాల్లోని మొత్తం 15.79కోట్ల మంది ఓటర్లు 1629 మంది భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఇందుకోసం లక్షా 81 వేల పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తోంది.
భారీ భద్రత...
రెండో దశ పోలింగ్ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం. మొదటి దశలో ఏర్పడిన సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటోంది.
తమిళనాడులో...
దక్షిణ భారతంలో అత్యధిక సీట్లున్న రాష్ట్రం తమిళనాడు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండే ఈ రాష్ట్రంలోనున్న మొత్తం 39 లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ దశలోనే ఎన్నిక పూర్తి కానుంది. ఇక్కడ ప్రధానపోరు డీఎంకే,అన్నా డీఎంకేల మధ్యనే.
లోక్‌సభతో పాటు తమిళనాడులోని 18 శాసనసభ స్థానాలకు ఉపఎన్నిక జరగనుంది.
ఈశాన్యాన...
ఈశాన్యాన ఈ విడతలో మూడు రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతుంది. అసోంలో 5 స్థానాలు, మణిపూర్‌లో ఒక స్థానం, త్రిపురలో ఒక స్థానానికి ఏప్రిల్ 18న ఓటింగ్.
రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం | 2వ విడత నియోజకవర్గాలు/ మొత్తం నియోజకవర్గాలు | ఓటర్ల సంఖ్య | పోటీ చేస్తున్న అభ్యర్థులు | పోలింగ్ బూత్‌ల సంఖ్య |
అసోం | 05 / 14 | 6910592 | 50 | 8992 |
బిహార్ | 05 /40 | 8552274 | 68 | 8644 |
ఛత్తీస్‌గఢ్ | 03/11 | 4895719 | 36 | 6484 |
జమ్ముకశ్మీర్ | 02/06 | 2960027 | 24 | 4426 |
కర్ణాటక | 14/28 | 26338277 | 241 | 30410 |
మహారాష్ట్ర | 10/48 | 18546036 | 179 | 20321 |
మణిపూర్ | 01/02 | 928626 | 11 | 1300 |
ఒడిశా | 05/21 | 7693123 | 35 | 9117 |
తమిళనాడు | 39/39 | 59869758 | 845 | 67664 |
త్రిపుర | 01/02 | 1257944 | 10 | 1645 |
ఉత్తరప్రదేశ్ | 08/80 | 14076635 | 70 | 16162 |
పశ్చిమబంగా | 03/42 | 973161 | 42 | 5390 |
పుదుచ్చేరి | 01/01 | 973161 | 18 | 970 |
మొత్తం | 97 | 157934518 | 1629 | 181525 |