ETV Bharat / bharat

రాజ్యసభ వయా భాజపా.. శుక్రవారమే సింధియా నామినేషన్​

రాజ్యసభ ఎన్నికలకు జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం నామినేషన్​ దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్​ నుంచి తప్పుకున్న ఆయన బుధవారమే భాజపాలో చేరారు. ఫలితంగా మధ్యప్రదేశ్​లో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి సింధియాకు కేటాయించారు కమలనాథులు.

Scindia to file nomination papers for RS polls on Friday
రాజ్యసభ ఎన్నికలకు శుక్రవారమే సింధియా నామినేషన్​
author img

By

Published : Mar 12, 2020, 5:59 AM IST

Updated : Mar 12, 2020, 6:40 AM IST

రాజ్యసభ వయా భాజపా.. శుక్రవారమే సింధియా నామినేషన్​

భాజపా తీర్థం పుచ్చుకున్న జ్యోతిరాదిత్య సింధియా మార్చి 26న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు శుక్రవారం మధ్యాహ్నం నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ భాజపా మీడియా సెల్ ఇన్​ఛార్జ్​ లోకేంద్ర పరాషర్​ తెలిపారు.

సింధియా కాంగ్రెస్​ను వీడి బుధవారం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో భాజపాలో చేరారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్​లో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఒకటి కాంగ్రెస్​కు, రెండు భాజపాకు ఉంటాయి. వీటిలో ఒక సీటును సింధియాకు కేటాయిస్తున్నట్లు భాజపా ప్రకటించింది.

నామినేషన్​

సింధియా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు భోపాల్ చేరుకుంటారు. కాంగ్రెస్​ను వీడిన తరువాత రాష్ట్ర రాజధానికి సింధియా రానుండడం ఇదే మొదటిసారి.

'శుక్రవారం నాడు దివంగత భాజపా నేతలు దీన్​దయాల్​ ఉపాధ్యాయ, రాజమాత సింధియాల విగ్రహాలకు పూలమాలలు వేస్తారు. అనంతరం రాజ్యసభ నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారని' లోకేంద్ర తెలిపారు.

ఇదీ చూడండి: దేశంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్​ కేసులు

Last Updated : Mar 12, 2020, 6:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.