దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అయోధ్య భూవివాదం కేసుపై తుది తీర్పును రేపు వెలువరించనుంది సుప్రీంకోర్టు . 40 రోజుల పాటు సాగిన సుదీర్ఘ విచారణ అనంతరం అక్టోబర్ 16న తీర్పును రిజర్వ్ చేసింది సర్వోన్నత న్యాయస్థానం.
జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు వివాదాస్పద అయోధ్య కేసుపై తీర్పును వెలువరించే అవకాశముంది.
అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుస్తు భద్రతా ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించినట్లు హోంమంత్రిత్వశాఖ అధికారులు స్పష్టం చేశారు.