ETV Bharat / bharat

లాలూ ​బెయిల్​ పిటిషన్​పై 10న విచారణ - కపిల్ సిబల్

'రాష్ట్రీయ జనతాదళ్​' అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ బెయిల్​ పిటిషన్​పై ఏప్రిల్​ 10న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ప్రస్తుతం లాలూ.. దాణా కుంభకోణం కేసులో కారాగార శిక్ష అనుభవిస్తున్నారు.

'లాలూ '​బెయిల్​ పిటిషన్​పై ఏప్రిల్​ 10న విచారణ
author img

By

Published : Apr 5, 2019, 1:14 PM IST

Updated : Apr 5, 2019, 3:45 PM IST

లాలూ ​బెయిల్​ పిటిషన్​పై 10న విచారణ

'రాష్ట్రీయ జనతాదళ్​' (ఆర్జేడీ) అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్​ బెయిల్ పిటిషన్​పై ఏప్రిల్​ 10న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. దీనిపై 9వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ను ఆదేశించింది.

దాణా కుంభకోణానికి సంబంధించిన మూడు కేసుల్లో లాలూ ప్రసాద్​ యాదవ్​కు జైలు శిక్ష పడింది. లాలూ బెయిల్​ కోసం దాఖలు చేసిన పిటిషన్​ను జనవరి 10న ఝార్ఖండ్​ హైకోర్టు కొట్టివేసింది. ఈ కారణంగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

లాలూ తరపున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్​ వాదనలు వినిపించారు. బెయిల్​ పిటిషన్​పై తక్షణం విచారణ జరపాలని కోరారు. దీనిపై స్పందించిన సొలిసిటర్ జనరల్​, సీబీఐ దీనిపై సమాధానం ఇవ్వాలని కోరారు.

ఇదీ నేపథ్యం..

ఝార్ఖండ్​, బిహార్​ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 1990ల్లో లాలూ ప్రసాద్​ యాదవ్​ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో రూ.900 కోట్ల రూపాయల విలువైన దాణా కుంభకోణం జరిగింది. ఈ కుంభకోణానికి సంబంధించిన మూడు కేసుల్లో లాలూ దోషిగా తేలారు. ప్రస్తుతం ఆయన రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్​ జైలులో కారాగార శిక్ష అనుభవిస్తున్నారు.

ఇదీ చూడండి: ఐదేళ్లలో రాహుల్ గాంధీ​ ఆస్తులు రెట్టింపు

AP Video Delivery Log - 0500 GMT News
Friday, 5 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0447: UK Assange 2 AP Clients Only 4204536
Assange supporters put sign outside Ecuador embassy
AP-APTN-0421: ARCHIVE US ICE Director Mandatory Credit US Department of Homeland Security 4204534
White House pulls nomination to lead ICE
AP-APTN-0412: New Zealand Christchurch Accused No access New Zealand 4204533
NZ attacks accused to undergo mental health tests
AP-APTN-0400: Argentina Disappeared AP Clients Only 4204532
Argentina: Bodies of 600 people wait to be identified
AP-APTN-0358: Australia Syria IS Orphans No access Australia 4204531
Australia aiming to repatriate IS orphans from Syria
AP-APTN-0340: South Korea Fire No access South Korea 4204530
Massive fire rages on SKorea's northeast coast
AP-APTN-0308: South Korea 5G Network AP Clients Only 4204528
Customers get hold of SKorea's first 5G mobiles
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Apr 5, 2019, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.