కర్ణాటకలో అనర్హతకు గురైన 17 మంది ఎమ్మెల్యేల వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు ఈ నెల 13న తీర్పు వెలువరించనుంది. 17 మంది ఎమ్మెల్యేలను అప్పటి స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ అనర్హులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ వీరు గతంలో సుప్రీంను ఆశ్రయించారు. అక్టోబర్ 25న వాదనలు విన్న జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
డిసెంబర్ 5న ఉపఎన్నికలు...
ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడి ఖాళీ అయిన 15 స్థానాలకు డిసెంబర్ 5న ఉపఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ణయించింది. నవంబర్ 11 నుంచి 18 వరకు నామినేషన్ల సమర్పణకు గడువిచ్చింది. నిజానికి అక్టోబర్ 21నే ఉపఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే... అనర్హత కేసులో తీర్పు వెలువడే వరకు ఎన్నికలను వాయిదా వేయాలని ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారా శాసనసభ్యులు. ఈ నేపథ్యంలో.. ఎన్నికలను డిసెంబర్ 5కు వాయిదా వేసింది ఎన్నికల సంఘం.
కూలిన ప్రభుత్వం...
17 మంది అసమ్మతి ఎమ్మెల్యేల వల్ల కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం.. అప్పటి స్పీకర్ రమేశ్‌కుమార్ ఈ అసమ్మతి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు.
ఇదీ చూడండి:'మహా' ఉత్కంఠ: కాంగ్రెస్ నిర్ణయంపైనే అందరి దృష్టి