అత్యాచారం కేసులో భాజపా మాజీ ఎంపీ చిన్మయానంద్‌కు అలహాబాద్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై వచ్చే వారం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది.
అత్యాచార ఆరోపణలు...
ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో చిన్మయానంద్ నిర్వహిస్తున్న ట్రస్ట్ ఆధ్వర్యంలోని న్యాయ కళాశాలలో ఓ విద్యార్థిని.. ఆయనపై అత్యాచార ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో గతేడాది సెప్టెంబర్ 20న చిన్మయానంద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఈ నెల 3న ఆయనకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చిన్మయానంద్‌పై ఆరోపణలు చేసిన విద్యార్థినిని కూడా 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని ఆయనను బెదిరించిన కేసులో అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: 'సీబీఎస్ఈ' చొరవ.. వికాస కేంద్రాలుగా విద్యాలయాలు