ప్రతి రాష్ట్రంలోనూ మానవ హక్కుల న్యాయస్థానం ఏర్పాటు చేయాలనే అంశంపై రాష్ట్రాలు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని 2018 జనవరి 4న సుప్రీం ఆదేశించింది. ఈ ఆదేశాలను పాటించని 7 రాష్ట్రాలకు సర్వోన్నత న్యాయస్థానం రూ.లక్ష వరకు జరిమానా విధించింది.
మానవ హక్కుల న్యాయస్థానాల ఏర్పాటు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంపై నేడు సుప్రీం ధర్మాసనం విచారించింది. ఏఏ రాష్ట్రాలు ఈ అంశంపై తమ స్పందనలు తెలియజేయలేదని సుప్రీం ప్రశ్నించింది. 7 రాష్ట్రాలు తమ అభిప్రాయాలు ఇవ్వలేదని తెలుసుకున్న ధర్మాసనం ఈ మేరకు చర్యలు చేపట్టింది.
రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు రూ. లక్ష జరిమానా పడింది. తెలంగాణ, ఉత్తర్ప్రదేశ్, ఒడిశా, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలకు తలా రూ. 50 వేలు జరిమానా విధించింది సర్వోన్నత న్యాయస్థానం. ఈ 7 రాష్ట్రాలు తమ అభిప్రాయాలను 4 వారాల లోపు సమర్పించాలని ఆదేశించింది. విచారణను 6 వారాలు వాయిదా వేసింది.
- ఇదీ చూడండి: 'ఆంక్షలతో ఇబ్బందులున్నా ప్రాణనష్టం తప్పింది'