ETV Bharat / bharat

'నేర చరిత్ర గల నేతలను ఎన్నికల్లో నిషేధిస్తారా?'

నేరారోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నేతలు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలన్న వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ అంశంపై అభిప్రాయం చెప్పాలని కేంద్రానికి నోటీసులు జారీచేసింది.

SC seeks centre's response on barring convicted criminals from contesting elections
ఆ నేతల ఎన్నికల నిషేధంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
author img

By

Published : Sep 10, 2020, 7:40 PM IST

నేరారోపణలు ఉన్న నేతలు ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధించాలన్న వ్యాజ్యంపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఆరు వారాల్లోగా అభిప్రాయం చెప్పాలని స్పష్టం చేసింది.

చట్టసభ సభ్యులపై ఉన్న కేసులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని భాజపా నేత, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్​ దాఖలు చేసిన పిటిషన్​ను విచారించింది జస్టిస్​ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం. ఈ సందర్భంగా... పెండింగ్​లో ఉన్న కేసుల విచారణ తమ ప్రాధాన్యమని జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు.

రాష్ట్రాల వారీగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న నేరారోపణ కేసుల జాబితా నివేదికను ఇప్పటికే సుప్రీంకోర్టుకు సమర్పించింది అమికస్ క్యూరీ. దానిని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్​

దేశవ్యాప్తంగా మాజీ, ప్రస్తుత చట్టసభ సభ్యులపై నాలుగు వేలకు పైగా క్రిమినల్ కేసులు పెండింగ్​లో ఉన్నాయని ఈ నివేదిక పేర్కొంది. ఇందులో సగానికిపైగా సిట్టింగ్​ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం.

ఇదీ చూడండి:- 'ఆ సమస్యకు పరిష్కారం సీబీఎస్​ఈ చేతిలో లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.