'రామ్ కీ జన్మభూమి' సినిమాకు, అయోధ్య భూవివాదం కేసు మధ్యవర్తిత్వానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది సుప్రీం కోర్టు. సినిమా విడుదలను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్పై విచారణకు తిరస్కరించింది. విడుదలను వాయిదా వేయలేమని తేల్చిచెప్పింది. సినిమా విడుదలైతే అయోధ్య భూవివాదం కేసు మధ్యవర్తిత్వాన్ని బలహీన పరుస్తుందన్న పిటిషనర్ వాదనలను తోసిపుచ్చింది.
జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం పిటిషన్పై విచారించింది.
ఈ నెల 29న దేశవ్యాప్తంగా విడుదల కానుంది రామ్ కీ జన్మభూమి చిత్రం. సనోజ్ మిశ్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రామ మందిరం చుట్టూ తిరిగే వివాదాస్పద విషయాలను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
రామ్ కీ జన్మభూమి సినిమాపై దాఖలైన మరో పిటిషన్పై బుధవారం వాదనలు విన్న దిల్లీ హైకోర్టు రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛ హక్కుకు భంగం వాటిల్లకూడదంటే ప్రజలు సహనంతో ఉండాలని అభిప్రాయపడింది.