బంగాల్ అసెంబ్లీ ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఆర్టికల్ 32 ప్రకారం ఈ అంశంపై తాము విచారణ జరపలేమని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. చట్ట ప్రకారం స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు తగిన మార్గాలు ఉన్నాయని జస్టిస్ అశోక్ భూషణ్ వ్యాఖ్యానించారు. అనంతరం ఈ వ్యాజ్యాన్ని కొట్టివేశారు.
2021 అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా ప్రభుత్వం, ఎన్నికల సంఘం, ఇతర శాఖలను ఆదేశించాలని కోరుతూ..పునీత్ కౌర్ దండా అనే న్యాయవాది ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రతిపక్ష పార్టీల నేతలకు రక్షణ కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ తన వ్యాజ్యంలో కోరారు.
ఇదీ చదవండి: