ఎన్నికల సంఘం తనపై విధించిన 48 గంటల ప్రచార నిషేధాన్ని ఎత్తివేయాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి వేసిన పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు. ఈసీ చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం ఉత్తర్వులపై వేరే పిటిషన్ వేయాలని మాయావతి తరఫు న్యాయవాదికి సూచించింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం.
విద్వేష పూరిత ప్రసంగాలు చేస్తున్నారన్న కారణంతో బీఎస్పీ అధినేత్రి మాయావతిపై 48 గంటల ప్రచార నిషేధాన్ని విధించింది ఈసీ.
మేల్కొన్నట్టుంది
విద్వేష ప్రసంగాలు చేస్తున్న నేతలపై చర్యలను ఉద్దేశిస్తూ ఎన్నికల సంఘం మేల్కున్నట్టుందంటూ వ్యాఖ్యానించింది ధర్మాసనం. కొన్ని గంటల పాటు ప్రచార నిషేధం సరైందేనంటూ సమర్థించింది.
యోగికి 72, మాయావతికి 48 గంటలు
విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారన్న ఆరోపణలతో యూపీ సీఎం ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి మేనకా గాంధీ, ఎస్పీ నేత ఆజంఖాన్‌పై 72 గంటలు, బీఎస్పీ అధినేత్రి మాయావతిపై 48 గంటల ప్రచార నిషేధాన్ని సోమవారమే విధించింది కేంద్ర ఎన్నికల సంఘం.