ETV Bharat / bharat

'సైన్యంలో లింగ భేదాలకు తావు లేదు'

సైన్యంలో లింగ భేదాలకు తావు లేదని, సమానత్వం సాధించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆర్మీ చీఫ్​ జనరల్ ఎంఎం నరవణే తెలిపారు. మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటు, కమాండ్​ హోదాపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. సైన్యంలో అతివలకు ఇచ్చే ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తుందన్నారు సైన్యాధిపతి.

Army chief
నరవణే
author img

By

Published : Feb 20, 2020, 5:27 PM IST

Updated : Mar 1, 2020, 11:34 PM IST

'సైన్యంలో లింగ భేదాలకు తావు లేదు'

సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటు, కమాండ్​ హోదా కల్పించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వారి ప్రాధాన్యతను స్పష్టం చేస్తుందన్నారు సైన్యాధిపతి​ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే. సైన్యంలో లింగబేధం లేకుండా చేసేందుకు సైన్యం ప్రయత్నిస్తోందని తెలిపారు.

మహిళలను ర్యాంకు స్థాయిలో చేర్చుకోవడానికి సైన్యం చొరవ తీసుకుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం 100 మంది మహిళా సైనికుల బృందం మిలిటరీ పోలీస్ సెంటర్​లో శిక్షణ పొందుతోందన్నారు సైన్యాధిపతి.

"జాతి, లింగ ప్రాతిపాదికన సైన్యంలో వివక్ష ఉండదు. ఈ విషయంలో సైన్యం ఎప్పుడూ ముందుంటుంది. మహిళలను సీఎంపీ(కార్ప్స్​ ఆఫ్ ఆర్మీ మిలటరీ)లో జవాను హోదాలో ఆర్మీనే మొదట నియమించింది. ఇదే విధంగా ఇక ముందు కూడా లింగ సమానత్వం కోసం ప్రయత్నిస్తూనే ఉంటాం."

-జనరల్ నరవణే, భారత ఆర్మీ చీఫ్​

పాక్​ గురించి..

జమ్ము కశ్మీర్​లో ఉగ్ర చర్యలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు నరవణే. ఉగ్ర సంస్థలపై సైన్యం ఒత్తిడి పెంచుతోందన్నారు. ప్రతిసారి పాక్​కు మద్దతు ఇవ్వలేమని చైనా గ్రహించిందన్నారు. ఇప్పటికైనా పాక్ తన వ్యూహాన్ని మార్చుకోవాలని హితవు పలికారు ఆర్మీ చీఫ్​.

Last Updated : Mar 1, 2020, 11:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.