జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా గృహనిర్బంధంపై సమాధానమివ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి, జమ్ముకశ్మీర్ అధికారులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. గృహనిర్బంధంలో ఉన్న అబ్దుల్లాను కోర్టు ఎదుట హాజరు పరచాలని ఎండీఎంకే అధినేత వై.గోపాలస్వామి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ చేపట్టింది.
విచారణను ఈ నెల 30కి వాయిదా వేస్తున్నట్లు సీజేఐ తెలిపారు. ఈ లోపు సమాధానం ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం.
జమ్ము కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్రం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఫరూక్ అబ్దుల్లా, జమ్ము మాజీ సీఎం మెహబూబా ముఫ్తీతో పాటు కీలక నేతలను గృహనిర్బంధంలో ఉంచింది. ఇలాంటి చర్యలు చట్టవిరుద్ధమని వైగో పిటిషన్లో పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'కశ్మీర్లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించండి'