సుప్రీంకోర్టు 'రిజర్వేషన్ల తీర్పు'పై రగడ నేపథ్యంలో లోక్సభలో ప్రకటన చేశారు సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లోత్. పదోన్నతుల్లో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు తీర్పు ఇచ్చిన కేసుతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఉత్తరాఖండ్లో 2012లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చిందన్నారు. ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని తేల్చిచెప్పారు గహ్లోత్. ఈ విషయంపై ప్రభుత్వం ఉన్నతస్థాయిలో చర్చించి, తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
కేంద్రం వివరణతో సంతృప్తి చెందని కాంగ్రెస్ సభ్యులు... లోక్సభ నుంచి వాకౌట్ చేశారు.