కోర్టు ధిక్కరణ కేసులో స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా, కామిక్ ఆర్టిస్ట్ రచిత తనేజాకు సుప్రీంకోర్టు షోకాజ్ నోటీసులు పంపింది. న్యాయస్థానాన్ని ఉద్దేశించి వివాదాస్పద ట్వీట్లు చేయడంపై 6 వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే... కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి వారికి మినహాయింపు ఇచ్చింది.
కునాల్, రచిత సుప్రీంకోర్టు పై అభ్యంతరకర టీట్లు చేశారని కొందరు ఇదివరకే ఆరోపించారు. అటార్నీ జనరల్ అనుమతితో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు వేశారు.
కోర్టు ధిక్కరణకు పాల్పడిన వారికి న్యాయస్థానం రూ.2000 వరకు జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష విధిస్తుంది.
ఇదీచూడండి: 'ఖలిస్థాన్ ట్వీట్'పై కేంద్రానికి సుప్రీం నోటీసులు