ETV Bharat / bharat

'మహిళా కమిషన్'​ మంజూరు గడువు పొడిగింపు

భారత నావికా దళంలోని మహిళా ఎస్​ఎస్​సీ అధికారులకు శాశ్వత కమిషన్​ మంజూరు కోసం కేంద్రానికి ఇచ్చిన గడువును.. డిసెంబర్​ 31వరకు పొడిగించింది సుప్రీం. కరోనా సంక్షోభం నేపథ్యంలో గడువు పొడిగించాలని కేంద్రం కోరగా సానుకూలంగా స్పందించింది.

SC gives time till Dec 31 to Centre for granting permanent commission to women officers in Navy
'మహిళా కమిషన్'​ మంజూరు గడువు పొడిగింపు
author img

By

Published : Oct 29, 2020, 2:00 PM IST

భారత నావికాదళంలోని మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ మంజూరు చేసే విషయమై కేంద్రానికి ఇచ్చిన గడువును సుప్రీంకోర్టు ఈ ఏడాది ఆఖరు వరకు పొడిగించింది.

పురుషులతో పాటు మహిళా అధికారులకు సమాన హోదా కల్పించే లక్ష్యంతో.. భారత నావికాదళంలోని మహిళా ఎస్​ఎస్​సీ అధికారులకు శాశ్వత కమిషన్​ మంజూరు చేయాలని ఈ ఏడాది మార్చి 17న సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. మూడు నెలల్లోగా దీనిని అమలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే కరోనా నేపథ్యంలో గడువును ఆరునెలలు పొడిగించాలంటూ జూన్‌లో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. కేంద్రం అభ్యర్థనను పరిశీలించిన జస్టిస్ డీవై చంద్రచూద్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. గతంలో ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు డిసెంబర్​ 31 వరకు గడువిచ్చింది.

ఇదీ చూడండి:- 'ఉగ్ర ఎన్​జీఓ'ల్లో కొనసాగుతున్న ఎన్​ఐఏ సోదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.